వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆకుల మల్లికార్జున్
వాయిస్ ఆఫ్ భారత్, కోరుట్ల : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ “”రణం””‘ వార్త దినపత్రిక ఎడిటర్ ‘ఆకుల మల్లికార్జున్ ‘ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు రానా ప్రతాప్ రజ్జు భయ్యా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు తాడూరి కరుణాకర్ కు, ప్రమోద్ కుమార్ లకు,తోటి పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలపై గళమెత్తుతానని గ్రామీణ మండల స్ధాయి పాత్రికేయుల ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడంలో ముందు నిలుస్తానని ఆయన అన్నారు.
