వరంగల్ జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారినికి వినతి పత్రం
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్, వరంగల్): తెలంగాణ నాయి బ్రాహ్మణ సహకార సంఘాల ఫెడరేషన్ (ఉమ్మడి రాష్ట్రం)జారీచేసిన ఉత్తర్వుల ఆధారంగా జిల్లా స్థాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని దీనితో నాయి బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకోవడం నాయి బ్రాహ్మణుల సంక్షేమ స్కీములు అమలు యొక్క ప్రగతి సమీక్షించడం సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన జీ వో ఎంఎస్ నెంబర్ 35 తేదీ 7 -12 -2002 అమలుపరచుట ద్వారా నాయి బ్రాహ్మణ సంఘాలకు స్థలం కేటాయించుటకు వృత్తి పరమైన షాపులు నెలకొల్పుటకు గ్రామ పంచాయితీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు నెలకొల్పుటకు సాంప్రదాయ బంకులకు నెలకొల్పుటకు ఇతర సమస్యలను పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాము జీవ ప్రకారంగా ప్రభుత్వము జిల్లా కమిటీ కి చైర్మన్ అయిన జాయింట్ కలెక్టర్ జిల్లాలోని నాయి బ్రాహ్మణులు కులస్తుల నుండి నలుగురు ప్రతినిధులు ఒకరు మహిళ ముగ్గురు పురుషులు జిల్లా కమిటీకి నామినేట్ చేసే అధికారాన్ని ఇచ్చింది ఈ నలుగురు సభ్యుల పదవి కాలం నామినేటెడ్ చేసిన కాలం నుండి ఒక సంవత్సరం ఉంటుంది కమిటీ సమావేశం మూడు నెలలకు ఒకసారి లేఖ అవసరమైనప్పుడు తరచుగా సమావేశ సమావేశం అవుతుంది జిల్లా బిసి సంక్షేమ కమిటీ సంక్షేమ అధికారిని వరంగల్ నాయి బ్రాహ్మణ సంక్షేమ కమిటీ కన్వీనర్ గా కొనసాగుతారు కావున ఈ జీవోను అమలుపరచుటకు పరచాలని కొలనుపాక కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి & పూర్వ జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ కమిటీ సభ్యుడు సవినయంగా మనవి చేయుచున్నాము
