రేషన్ డీలర్లకు కమీషన్ ఇప్పించండి/Give commission to ration dealers

రేషన్ డీలర్లకు కమీషన్ ఇప్పించండి/Give commission to ration dealers
Give commission to ration dealers

జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్ కు వినతి 

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ కమీషన్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ధర్మసాగర్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 426 మంది రేషన్ డీలర్ల తరపున, రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి రేషన్ పంపిణీకి సంబంధించిన కమీషన్ విడుదల చేయకపోవడం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌కు విన్నవించారు. తమకు న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. రేషన్ డీలర్ల విజ్ఞప్తికి కలెక్టర్ స్నేహ శబరీష్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, డీలర్లకు కమీషన్ అందే విధంగా చూస్తానని ఆమె హామీ ఇచ్చారని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి, గడ్డం నాగేశ్వర్ రావు గౌడ్, సోంపెల్లి రవీందర్, చింతలపాని అన్వేష్ రెడ్డి, గడ్డం నాగేశ్వర్ రావు, పిల్లి రవీందర్, రవి రెడ్డి, లక్ష్మినారాయణ,సంపెల్లి విజయకుమారి, బి. అరుణ, పి. విమల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *