రేపే వసంత పంచమి
- తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ప్రత్యేకంగా చూడవలసిన వీడియో
- పరీక్షలలో ఫస్ట్ ర్యాంక్ పొందటానికి అమ్మవారి మూలమంత్రం
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్): హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వరలక్ష్మీ వ్రతం, దేవి నవరాత్రులు ఎలాగో వసంత పంచమి కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన పండుగ, త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో అలాగే త్రిశక్తులలో లక్ష్మీదేవి పార్వతి దేవి సరస్వతి దేవి లను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తాము. ముగ్గురమ్మలలో ఒకరైన పార్వతి మాత జన్మించిన రోజే వసంత పంచమి, ఈరోజు సరస్వతి మాతకు ఎంతో ఇష్టమైన రోజు, చదువుల తల్లి అయినా సరస్వతి దేవిని వసంత పంచమి రోజున భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే విద్యార్థులకు చదువులలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మనకు దేవాలయాలలో సరస్వతీ మాత ఆలయాలు అరుదుగా ఉంటాయి. మనకు తెలిసిన దేవాలయాల్లో సరస్వతి మాతకు సంబంధించి బాసర చాలా విశిష్టమైన అమ్మవారి దేవాలయం, వసంత పంచమి రోజు బాసరలో అమ్మవారికి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. అంత దూర భారం వెళ్లలేని వారు ఆరోజు అమ్మవారిని పూజించడానికి సరస్వతి మాత పటాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో చక్కగా పూజించుకోవచ్చు.
ముఖ్యంగా సరస్వతి మాత స్తోత్రాలు, అష్టకాలు చదివినట్లయితే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. చదువుకునే విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందడానికి అదేవిధంగా మొదటి ర్యాంకు సాధించడానికి అమ్మవారి మూల మంత్రాలు, జపం చేయవలసి ఉంటుంది, సరస్వతి మాత యొక్క మూల మంత్రాన్ని ప్రతినిత్యం ఒక వెయ్యి ఎనిమిది సార్లు లేదా 108 సార్లు జపం చేసినట్లయితే విద్యార్థులు చదువులలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది, ఈ మంత్రసాధనకు గురూపదేశం పొందవలసి ఉంటుంది.
ముఖ్యంగా వాయిస్ ఆఫ్ భారత్ పాఠకులకు ప్రత్యేకంగా అమ్మవారి మూలమంత్రాన్ని పొందేందుకు ఇక్కడ ఒక లింకు ఇవ్వడం జరిగింది. మీరు ఈ యూట్యూబ్ వీడియో కనుక చూసినట్లయితే అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఉపదేశం పొంది ప్రతినిత్యం పాటించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ వీడియోను చూడవలసిందిగా మనవి
