రేపటినుంచి టెక్నోజియాన్-2024

రేపటినుంచి టెక్నోజియాన్-2024
  • 19 నుండి 21 వరకు నిర్వహణ
  • నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుది

వాయిస్ ఆఫ్ భారత్, టెక్నాలజీ : ఎన్ఐటీ వరంగల్ ప్రతిష్టాత్మక వార్షిక టెక్నికల్ ఫెస్ట్, టెక్నోజియాన్-2024 ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుది తెలిపారు. గురువారం నిట్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2006లో స్థాపించిన టెక్నోజియాన్ యువతకు సాంకేతిక అభివృద్దిని అందించడంలో ముందంజలో ఉందన్నారు. ఈ ఫెస్ట్‌లో వివిధ ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వినూత్న ఆలోచనలు సేకరించడానికి, వారి సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పించడానికి అనేక టాప్ క్లాస్ ఈవెంట్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడు టెక్నోజియాన్ థీమ్ అన్వేషణ, సృజనాత్మకత, సాంకేతిక పరివర్తన యొక్క భావన అన్నారు. టెక్నోజియన్‌ ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ శ్రీనివాసన్‌ సుందరరాజన్ హాజరు కానున్నారన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ప్రతిష్టాత్మక క్షిపణుల రూపకల్పన, ఉత్పత్తి , అభివృద్ధి యొక్క అన్ని దశలలో పనిచేసిన ప్రఖ్యాత ఏరోస్పేస్, మిస్సైల్ సైంటిస్ట్ శ్రీనివాసన్‌ సుందరరాజన్ అన్నారు. అదేవిధంగా రెడ్ బస్ సీఈఓ ప్రకాష్ సంగం, ఇస్త్రో సైటిస్ట్ డాక్టర్ టీఎన్. సురేష్ కుమార్, వంశీ కూరపాటి వంటి వివిధ ముఖ్య వక్తలు విద్యార్థులకు వినూత్న నైపుణ్యాలపై సాంకేతిక అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా జహాజ్, ఆర్ సీ బగ్గీ, హోవర్ మానియా, వర్చువల్ రియాల్టీ, డీబగ్గింగ్ మానియా మొదలైన స్పాట్‌లైట్ ఈవెంట్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 40 టెక్నికల్ ఈవెంట్‌లను నిర్వహించాలని ప్లాన్ చేశామన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన స్పర్ధక్ బృందం వారిచే వాహన ప్రదర్శనను నిర్వహించనున్నారు. వివిధ సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని, ఈ టెక్నోజియాన్‌లో పాఠశాల విద్యార్థులు తమ నమూనాలు, ఆలోచనలను కూడా ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *