రెడ్డి కాలనీలో అన్న ప్రసాద వితరణ
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : న్యూ రెడ్డి కాలనీలోని పీసీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ వద్ద గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన సుమారు 300 మంది నివాసితులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని, అపార్ట్మెంట్, కాలనీ వాసులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ముందుగా కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదిత్య శర్మ, వంశీకృష్ణ ఐలి, అలుగువెల్లి నరేందర్, వెల్పుల నవీన్, రాజేందర్ కొలగాని, టాబేటి రాజేందర్ (రిటైర్డ్ పీడీ), గందారి యాదగిరి, ఆయిలు నరేందర్, టాబేటి సతీష్, గూడేపు శివాజీ, ముస్కు కార్తిక్‌లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో వారు కీలక పాత్ర పోషించారు.

