రాపెల్లి లింగమూర్తికి రాష్ట్ర స్థాయి అవార్డు
వాయిస్ ఆఫ్ భారత్ , వరంగల్ :పద్మశాలి అఫీషియల్స్ & ప్రొఫెషనల్స్(POPA) అసోసియేషన్ వరంగల్ జాతీయ స్థాయిలో పద్మశాలీల అభ్యున్నతికి పాటుపడిన ప్రముఖులకు అవార్డు ప్రకటించింది. అందులో అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ రాంపెల్లి లింగమూర్తికి స్పెషల్ కేటగిరీలో పురస్కారం వరించింది. ఈ మేరకు హనుమకొండ జిల్లా పరిషత్ హాల్లో ఆదివారం పద్మశాలి మెరిట్ విద్యార్థులు, ప్రముఖులు, రిటైర్డ్ ఉద్యోగులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పద్మశాలి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి చేతుల మీదుగా లింగమూర్తి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ కేటగిరీలో పురస్కారం రావడంపై ప్రతిభా పురస్కార్ కన్వీనర్, రాష్ట్ర పోపా అధికార ప్రతినిధి, అసోసియేషన్ అధ్యక్షుడు మాటేటి సంతోష్ కుమార్, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండు కామేశ్వర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, నాలో మరింత బాధ్యతను పెంచిందని లింగమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, జడ్పి మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, డీఎస్పీ (ఇంటలిజెన్స్) ఆడెపు సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుసుమ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
