రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తారా? ఎంత ప్రమాదమో తెలిస్తే..!!
నేటి సోషల్ మీడియా జమానాలో జనాలకు రీల్స్ చూడటం ఓ వ్యసనంగా మారింది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. స్మార్ట్ ఫోనులో రీల్స్, షార్ట్ వీడియోలు చూడటంలో మునిగిపోతున్నారు. వైద్యులు పలు సంచలన విషయాలను గుర్తించారు. రాత్రిళ్లు ఎక్కుసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపేవారిలో బీపీ వచ్చే ఛాన్స్ బాగా పెరిగినట్టు గుర్తించారు. యువతతో పాటు మధ్య వయస్కులు ఈ ప్రమాదం ఎక్కువగా ఎదుర్కుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ అలవాటుతో మెదడులోని సింపాథిటిక్ నాడీ వ్యవస్థ కూడా క్రియాశీలకం అవుతూ అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తున్నట్టు గుర్తించారు.పరిస్థితి ప్రమాదకరమని హెచ్చరించిన శాస్త్రజ్ఞులు రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, కుదిరితే అసలు రీల్స్ చూడొద్దని సూచించారు.
