రాజ పల్లెలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వాయిస్ ఆఫ్ భారత్, నర్సంపేట :రాజపల్లె గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో, పూలతో అలంకరించిన బతుకమ్మలను ఎత్తుకొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సవాన్ని ఉత్సాహంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆర్గనైజషన్స్ సాదబోయిన ప్రసాద్, బుస చిన్న రాజు,ముత్యం హరీష్,గడ్డం నాగరాజు, నామల సుభాష్, తోటకూరి పవన్, ముత్యం శివ, పసునూరి గిరి, కొత్తగట్టు రవి, గుళ్ల రాకేష్ డీజే ఆర్గనైజషన్, చొప్పరి వీరేందర్, బుస సాంబయ్య, గ్రామ పెద్దలు నామల సత్యనారాయణ, గుర్రాల రాఘవ రెడ్డి, చొప్పరి లక్ష్మినర్సు, నూనె కుమారస్వామి, కొండబాత్తుల సారయ్య, సలంద్ర వీరనర్సు, బతుకమ్మ పండుగలో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ఆడబిడ్డల ఆరాధనకు ప్రతీకమని, ఇలాంటి పండుగలు గ్రామీణ సంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను మరింత బలపరుస్తాయని తెలిపారు. గ్రామ యువత, మహిళలు, పిల్లలు అందరూ కలిసి పెద్ద ఎత్తున పండుగను నిర్వహించడం విశేషం.
