భవన నిర్మాణానికి అనుమతులేవీ..?
టౌన్ ప్లానింగ్ అధికారుల తీరే వేరు..
చర్యలు తీసుకోవడంలో జాప్యం..
అక్రమదారులకు వత్తాసు
జీహెచ్ఎంసీ అధికారులకు
బుట్టి రంజిత్ ఫిర్యాదు
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం రామకృష్ణ నగర్ జయశంకర్ విగ్రహం దగ్గర చింతల్ ఇంటి నెంబర్ 7-100/80 వద్ద జరుగుతున్న అనధికారిక నిర్మాణం చేపట్టారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికి నిర్మాణాలు కొనసాగుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణంపై బీఆర్ కే బుట్టి రంజిత్ మహర్ MAYS రాష్ట్ర అధ్యక్షుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చర్యల తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. పైగా అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణం కూల్చివేసి తగిన చర్యలు తీసుకోవాలరి MAYS రాష్ట్ర అధ్యక్షుడు బుట్టి రంజిత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
