బాధిత కుటుంబానికి చల్లా పరామర్శ

బాధిత కుటుంబానికి చల్లా పరామర్శ
EX MLA chal @PARALA # DAMERA

వాయిస్ ఆఫ్ భారత్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో నిన్న మృతిచెందిన మన్నెం రాంరెడ్డి పార్థీవ దేహాన్ని శుక్రవారం పరకాల మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా ఊరుగొండ గ్రామంలో ఇటీవలే మృతిచెందిన నల్ల సారమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సారమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *