బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

 

వాయిస్ ఆఫ్ భారత్, దేవరుప్పుల : మండలంలోని పెద్దమడూరు గ్రామంలో ఏడవ రోజు బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి పాల్గొని గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, పాటలు పాడి సంబరాలను మరింత ప్రత్యేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగలో మన తెలంగాణ సాంప్రదాయం, ఆచారాలు, ఆత్మీయత ప్రతిబింబిస్తాయి. పూలతో అలంకరించే బతుకమ్మ మన ప్రకృతి పట్ల గల ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తుంది. మహిళలు ఒక చోట చేరి పాటలు పాడుతూ, ఆడుతూ ఈ పండుగను జరుపుకోవడం సామాజిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు. అలాగే, మహిళల పాత్ర సమాజ నిర్మాణంలో ఎంతో గొప్పదని, బతుకమ్మ పండుగ వారిని మరింతగా ఏకం చేస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఈ విధంగా తరతరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే గుర్తుచేశారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువత, పిల్లలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *