ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్ ,దామెర: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రము లో రూ.20 లక్షల ఈజీఎస్ నిధులతో మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సీ సీ రోడ్లు, పశువుల షెడ్, నాటు కోళ్ల పెంపకం, తదితర పనులు మంజూరయ్యాయని, వాటిని త్వరలోనే ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. మహిళలకు త్వరలోనే పారిశ్రామిక వేత్త లుగా, ఆర్థికంగా ఎదిగే విధంగా కార్యక్రమాలు రూపొందించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బాలరాజు, తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మిదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బిల్లా రమణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, భిక్షపతి, మార్కెట్ డైరెక్టర్ శంకర్, రవీందర్, నాయకుడు పోలపాక శీను, మొద్దు ప్రవీణ్, ఏవో రాకేష్, మండల వైద్యాధికారి డాక్టర్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.
