పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం
- కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత
వాయిస్ ఆఫ్ భారత్ ( లోకల్ న్యూస్ ) : పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎష్ బయ్యారం మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలోని శ్రీరామచంద్రస్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగింది . కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, బాణోత్ రవి కుమార్, బయ్యారం మండల అధ్యక్షులు తాత మధు, సత్యనారాయణ, శ్రీకాంత్ నాయక్, మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
