పార్టీ సభ్యత్వ నమెదు ఒక ఉద్యమంగా సాగాలి
- పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు
- పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు వరంగల్ పర్యటన
- భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
- ప్రముఖులతో సభ్యత్వ నమోదు
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రఘునందన్ రావు ఖండన
- సభ్యత్వ నమోదు అంటే గణాంకాలు మాత్రమే కాదు
- దేశభక్తితో బీజేపీ కార్యకర్తలు
వాాయిస్ ఆఫ్ భారత్ (పొలిటికల్ న్యూస్) : విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ సభ్యత్వ నమోదు కోసం వరంగల్ జిల్లాకు విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావును భద్రకాళి అమ్మవారి ఆలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత, నగరంలోని పలు ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, సంఘ పెద్దలను కలిసి బీజేపీ సభ్యత్వ నమోదు చేపించారు. 34వ, 35వ డివిజన్ శివనగర్, 36వ డివిజన్ చింతల్ ప్రాంతాల్లో, 18వ డివిజన్ లేబర్ కాలనీలో పలువురిని కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
తరువాత, ఎస్ఎస్ కే సమాజ్ మట్టెవాడలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ, అమెరికా పర్యటనలో భారతదేశం, ప్రజాస్వామ్యం పట్ల రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.సభ్యత్వ నమోదు గురించి మాట్లాడుతూ, అది గణాంకాలు, అంకెలు కాదని, ఇది ఒక పూర్తి స్థాయి సైద్ధాంతిక ఉద్యమమని రఘునందన్ రావు తెలిపారు. సభ్యత్వం అనేది కేవలం పార్టీ సభ్యుల సంఖ్యను పెంచడం మాత్రమే కాకుండా, దేశాన్ని బలోపేతం చేయడం కూడా అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా భావించి, వేడుకగా మార్చాలని కోరారు.
బీజేపీ కార్యకర్తలు దేశభక్తితో ప్రేరణ పొందారని, భారత్ మాత సంక్షేమం కోసం, 140 కోట్ల దేశ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామని అన్నారు. కొత్తవారు ముందుకు రావడ్డం గర్వించదగ్గ విషయంగా భావించాలి. అంతే గాని వారు ఏదో లాభాపేక్షతో పార్టీలో చేరారని భావించకూడదన్నారు.
#Membership Drive #Ideological Movement #Raghunandan Rao
#Warangal #BJP (Bharatiya Janata Party) #Vishesha Sampark Abhiyan
#Bhadrakali Temple #Purnakumbham Welcome #Community Leaders
#Membership Program # Welfare of Bharat Mata #Commitment
#Welfare of Indian Citizens #Statistics #National Interests
