పవన్ ‘ఓజీ’ లెక్కలతో ఇండస్ట్రీ షేక్: మొదలైన కలెక్షన్ల ఊచకోత

పవన్ ‘ఓజీ’ లెక్కలతో ఇండస్ట్రీ షేక్: మొదలైన కలెక్షన్ల ఊచకోత
VoiceofBharath (movie nuews) : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (ఒజాస్ గంభీరా) చిత్రం సెప్టెంబర్ 25న (రేపు) గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఓజీకి ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధికంఈ భారీ హైప్ నేపథ్యంలో, బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.300 నుంచి 310 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని అంచనా వేస్తున్నారు. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరగడంతో, తొలిరోజు వసూళ్లు 125-140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ కావొచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దసరా సీజన్‌లో సోలోగా వస్తున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం సులువేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయియంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ రూ.80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
If you like this content  Please Subscibe our Website. for more updates follow our website : https://voiceofbharath.in

#OG

#OGMovie

#OGPreReleaseBusiness

#PawanKalyan

#PawanKalyanOG

#Sujeeth

#ImranHashmi

#PriyankaMohan

#Tollywood

#BoxOffice

#Blockbuster

#BreakEven

#Day1Collections

#OGRelease

#OjasGambheera

#MovieUpdates

#TeluguCinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *