పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన టీఎన్జీఓస్
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం బాధ్యులు వారి సమస్యలకు సంబంధించి హనుమకొండ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన పరిధిలోని సమస్యలపై సానుకూలంగా స్పందించడం జరిగింది. రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆకుల రాజేందర్, టీఎన్జీఓస్ బాధ్యులు కలెక్టర్ కు పుష్పగుచ్చం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణు గోపాల్, కోశాధికారి పనికెల రాజేష్, కేంద్ర సంఘం నేతలు శ్యామ్ సుందర్, సారంగపాణి, కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు అశోక్, కార్యదర్శి నరేష్, కోశాధికారి రాజు, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు రఫీ, వెంకటేశం, శ్రీనివాస్, అర్శం శ్రీనివాస్, వేణు మాధవ్, యాదగిరి, వెంకన్న, కిషోర్, సతీష్, లావణ్య, జిల్లా టీఎన్జీఓస్ నేతలు భరత్, ఎర్రాప్రగడ తదితరులు పాల్గొన్నారు.
