నాడీ వైద్యంలో ఆమెకామె సాటి.. డాక్టర్ కల్లెపల్లి అక్షిత
నాడీ థెరపిస్ట్ లో డాక్టరేట్
చేయు పట్టుకుంటే చాలు రోగాలు దూరం
వైద్య రంగంలో ప్రత్యేక ముద్ర



నాడీ పట్టుకుంటే చాలు.. రోగం చిటుక్కున మాయమైపోతుంది. తన వద్దకు వైద్యం కోసం వచ్చే వారి పరిస్థితి ఆమెకు ఇట్టే తెలుస్తుంది. ఆ బాధలను అర్ధం చేసుకొని తన తరహాలో వైద్యమందించి వారి రోగాలను మటు మాయం చేస్తుంది. ఆమె ఎవరో కాదు తన నాడీ వైద్యంతో గొప్ప ఫలితాలు చూపుతున్న కల్లేపల్లి అక్షిత.. తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటి నాడీ థెరపిస్ట్ గా అక్షిత వెస్టన్ అమెరికా నుంచి డాక్టరేట్ పొంది తన ప్రతిభను ప్రపంచ నలుమూలలకు చాటింది.
వాయిస్ ఆఫ్ భారత్, సిరిసిల్ల :
నాడీ వైద్యంలో ప్రత్యేకత..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ కల్లేపల్లి అక్షితకు చిన్నప్పటి నుంచి వైద్య విద్యపై మక్కువ ఎక్కువ.. ఆమె వైద్య రంగంలో తన ప్రత్యేకతను చాటాలని నిర్ణయించుకొని నాడీ థెరపిస్ట్ అనే ప్రత్యేక సబ్జెక్ట్ ను ఎంచుకొంది. నాడీ వైద్యంలో ఉన్న అన్ని చికిత్సలను ఆమె అవపోశన పట్టారు. తనకున్న అభిరుచితో నాడీ వైద్యంలో ఎన్నో ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు కూడా రాబట్టారు. దీంతో ప్రజల్లో ఆమె ఆదరణ మంచి పెరిగింది. దీంతో ఈ నోటా.. ఆనోటా.. ఆమె నాడీ వైద్యం ప్రచారం జరిగి ప్రజల్లో ఎనలేని నమ్మకం ఏర్పడింది.
అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్..
డాక్టర్ కల్లేపల్లి అక్షిత రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి. గత కొన్ని సంవత్సరాలుగా నాడీ వైద్యరంగంలో సేవలందిస్తూ తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటి నాడీ తెరపిస్టుగా వెస్టన్ అమెరికా యూనివర్సిటీ నుంచి పద్మశాలి ముద్దుబిడ్డ కల్లేపల్లి అక్షిత ఆయుర్వేద డాక్టర్ గా డాక్టరేట్ అందుకున్నారు. కల్లేపల్లి అక్షిత గారునాడీ వైద్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి గౌరవప్రదమైన డాక్టర్ రేట్ అవార్డును అందజేసి గౌరవంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెను పద్శశాలీ కుల సంఘనాకులు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు.
