దేశవ్యాప్త సమ్మె విజయవంతం
దాక్ సదన్ లో ఒకరోజు సమ్మె
హైదరాబాద్‌లో పోస్టల్ ఉద్యోగుల నిరసన
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : కేంద్రంలోని ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ఉద్యోగ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఎన్‌ఎఫ్‌పీఈ (NFPE) యూనియన్ అనుబంధ సంఘాల ఉద్యోగులు చీఫ్ పీఎంజీ కార్యాలయం ‘దాక్ సదన్’లో తలపెట్టిన ఒకరోజు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, ఏపీ కేంద్ర ఉద్యోగ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అజీజ్ మాట్లాడుతూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఎనిమిదో వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఎన్‌ఎఫ్‌పీఈ సంఘానికి కోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచి గుర్తింపును పునరుద్ధరించాలి. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 18 నెలల డీఏ బకాయిలను విడుదల చేయాలి. కారుణ్య నియామకాలలో 5శాతం సీలింగ్‌ను ఎత్తివేయాలి. జీడీఎస్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన జీతం అందించాలని తెలంగాణ పోస్టల్ ఉద్యోగులు ఈ సమ్మెలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌పీఈ రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ శ్రవణ్ కుమార్, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యదర్శులు కామ్రేడ్ యు. మహేందర్, చారీ, శ్రీకాంత్, సోమేశ్, ముతేష్, మధుసూదన్, సీనియర్ కామ్రేడ్ డీ.ఎన్. మూర్తి, జనాభాయ్, లక్ష్మి, కవిత, పెన్షనర్ సంఘ నాయకులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.

