దాసరి కనకమ్మ కుటుంబానికి చేయూత

దాసరి కనకమ్మ కుటుంబానికి చేయూత
Dasari Kanakamma's family is in need of help.

పద్మశాలి సంఘం తరపున రూ.5వేల ఆర్థిక సాయం
వాయిస్ ఆఫ్ భారత్, ఎల్కతుర్తి  :  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన దాసరి కనకమ్మ అనే వృద్ధురాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కడు నిరుపేద కుటుంబానికి చెందిన పద్మశాలి మహిళ చనిపోవడంతో ఒక్కగానొక్క కుమార్తె సమ్మక్క ఒంటరైంది. నిరుపేద కుటుంబం కావడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కుటుంబానికి అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ ముందుకు వచ్చి అండగా నిలిచింది. ఈ కుటుంబానికి రూ.5 వేల నగదు ఆర్థిక సాయంతో పాటు, చీకట్లో మగ్గుతున్న కుటుంబానికి కరెంటు మీటర్ ఏర్పాటుతో పాటు, నల్లా నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు తక్షణ హామీ ఇచ్చింది. పద్మశాలి సమస్యల సాధన కోసం జిల్లా కమిటీ ఎల్లప్పుడూ ముందు నిలుస్తుందని జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం, రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు సత్కూరి సంతోష్, కార్యదర్శి గైనీ సత్యనారాయణ, దేవసాని సదానందం, వేముల సమ్మయ్య, దాసరి నాగభూషణం, దాసరి రాజయ్య, శ్రీనివాసు, బిట్ల రవి, వేముల శివ, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *