తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు కేసీఆర్‌
@@@KCR, the dreamer and achiever of Telangana state@@

వాయిస్ ఆఫ్ భారత్, డోర్నకల్ : కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, సమున్నత అస్తిత్వం, ఉద్యమ పటుత్వం, ఆవేశాల అగ్నితత్వం, అనురాగాల అమృతత్వం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం, అభ్యుదయమని బీఆర్ఎస్ మండల నాయకులు, మాజీ ఎంపీపీ బాలునాయక్, పట్టణాధ్యక్షులు కత్తైరశాల విద్యాసాగర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నప్రసాదాలు పంపీణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట స్వాప్నికుడు, సాధకుడు కేసీఆర్‌ కృషితో ప్రత్యక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దుష్ట కాంగ్రెస్ పాలన అంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఉమ్మడి పాలనలో మన భాష, యాసలను అవహేళలనకు గురవుతుంతే కేసీఆర్‌ ఉద్యమించి స్వరాష్ట్ర కలను నిజం చేశారన్నారు. కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. దశాబ్దాల అణిచివేత, దోపిడీ పీడల నుంచి తెలంగాణ జాతికి విముక్తి కల్పించిన ప్రజలను మోసం చేసిన పచ్చపాలకులు రంగు మార్చి మరో మారు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారం చేపట్టడం ఎంతో దూరం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *