తెరపైకి ‘షాన్’

తెరపైకి ‘షాన్’
  • హీరో బూస కుమార్ యాదవ్ గురిజాల వాసి
  • గ్రామస్థులకు, స్నేహితులు, బంధువులు తిలకించాలంటూ పిలుపు

    (వాయిస్ ఆఫ్ భారత్, సినిమా)  నర్సంపేట మండలం గురిజాల గ్రామం జీజీఆర్ పల్లికి చెందిన యువకుడు బూస కుమార్ యాదవ్ తొలిసారి కేవై ఫిలిమ్స్ బ్యానర్ పై హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘షాన్’ తెలుగు సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో కూడా విడుదల చేస్తున్నారు. నర్సంపేటలోని జయశ్రీ టాకీస్ లో కథానాయకుడు బూస కుమార్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేయడంతోపాటు ప్రేక్షకులతో కలిసి షాన్ సినిమాను వీక్షించనున్నారు. మారుమూల గ్రామంలో జన్మించిన యువ కథానాయకుడు కుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపు విడుదలవుతున్న ‘షాన్’ తెలుగు సినిమాను అందరూ ఆదరించి, నిండు మనస్సుతో ఆశీర్వదించి సినిమాకు ఘన విజయం సాధించి పెట్టాలని కోరారు. మనం ఇంతవరకు మనకు సంబంధం లేని వారి సినిమాలను ఎంతో ఆదరించాం. ఇప్పుడు మీ బిడ్డగా.. నర్సంపేట నియోజకవర్గ ప్రాంత వాసిగా.. స్నేహితుడిగా.. మీ శ్రేయోభిలాషిగా.. మీ క్లాస్ మేట్ గా…మీ బంధువుగా…మీలో ఒక్కడిగా ‘షాన్’ సినిమా ద్వారా రేపు మీ ముందుకొస్తున్నాను. నేను తొలిసారి నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా నటించిన ఈ సినిమాకు అఖండ విజయం సాధించి పెట్టి ఆశీర్వదిస్తారని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *