తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ
  • దోషులను ఉరితీయాల్సిందే !
  • జంతువుల కొవ్వుతో తయారీ
  • దేశవ్యాప్తంగా సంచలనం..
  • కోట్ల భక్తుల గుండెలను రగిలిస్తున్న అంశం
  • మండిపతున్న బీజేపీ, హిందూ సమాజం
  • తక్షణ నివేదికకు ఆదేశాలు

వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్) : తిరుమల అంటే కలియుగ వైకుంఠం.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే వారు కోట్లాదిమంది ఉంటారు. ఇక నెలరోజులకోమారు వెళ్లేవారు కూడా ఉంటారు. ప్రత్యక్ష దైవాన్ని చూసి తమ గోడు వెళ్లబోసుకునేవారు కోటాను కోట్ల మంది. తిరుమలలో స్వామి దర్శనం ఒక ఎత్తయితే.. స్వామివారి ప్రసాదం మరో ఎత్తు. లడ్డూ ప్రసాదం తింటేనే స్వామి అనుగ్రహం కలిగిందన్న అనుభూతి పొందుతాడు. ఇలా లడ్డూ ఎన్నో ఏళ్లుగా భక్తుల జీవితంలో భాగమయ్యింది. లడ్డూను కించిత్‌ కూడా కిందపడకుండా తొక్కుళ్లలో పడకుండా పరమ పవిత్రంగా చూస్తారు. స్వామి లడ్డూ కోసం నానా తంటాలు పడి సంపాదిస్తారు. మరో లడ్డూ కావాలంటూ కాళ్లావేళ్లా పడతారు. మంచి ఆవునెయ్యితో తయారు చేసినది కావడం వల్ల తిరుమల గిరులు లడ్డూ వాసనలు వెదజల్లుతాయి. తిరుమల వెళ్లి వచ్చిన వారు తమ ఇరుగుపొరుగు, బంధువులకు లడ్డూ అందచేయడం ఆనవాయితీ. అలాంటి లడ్డూ కల్తీ అయ్యిందన్న వార్త ఇప్పుడు భక్తుల గుండెలను దహించి వేస్తోంది.

తిరుమల భక్తుల జీవితంలో పెనవేసుకున్న సెంటిమెంట్‌. దీనిని ఎవరూ కాదనలేరు. జంతువుల కొవ్వుతో చేసిందన్న వార్త రగిలించవేస్తోంది. నాన్‌ హిందువుల పెత్తనంలో తిరుమల బోర్డు భ్రష్టు పట్టిందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. వైవీ సుబ్బారెడ్డి కావచ్చు.. భూమన కరుణాకర్‌ రెడ్డి కావచ్చు.. ఇద్దరూ హిందూ మతావలంబకులు కారు. కానీ ప్రభుత్వం తమదే కావడంతో జగన్‌ తన తాబేదార్లను టిటిడి ఛైర్మన్లుగా నియమించారు. నిజానికి తిరుమలలో అన్యమతస్థులకు స్థానం లేదు. అయినా జగన్‌ సాహసం చేసి చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. చంద్రబాబు కావచ్చు.. అంతకుముందు ఎన్టీఆర్‌ కావచ్చు.. వారి కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. అందుకే కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా పేరూఊరులేని కంపెనీలకు నెయ్యి ఆర్డర్‌ ఇచ్చారు. దీంతో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న వార్త కోట్లాదిమంది భక్తుల గుండెలను రగిలించేస్తోంది. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో లడ్డూ ప్రత్యేకతలపై విస్తృత చర్చ జరుగుతోంది.

అత్యంత పవిత్రమైంది శ్రీవారి లడ్డూ..

శ్రీవారి లడ్డూ అత్యంత పవిత్రమైనది. లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో మరెవరూ అలాంటి లడ్డూను తయారు చేయరు.. చేయలేరు కూడా. అంతటి మహిమ కూడా దీనికి ఉంది. తిరుమల లడ్డూకు 2014లో జీఐ స్టేటస్‌ వచ్చింది. జియో గ్రాఫికల్‌ ఐడెంటిఫికేన్‌ అంటే భౌగోళిక గుర్తింపు ప్రపంచ వాణిజ్య సంస్థ ఇస్తుంది. తమ సభ్యదేశాలు తమ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆహార ఉత్పత్తులు, చేనేత కళలు, వస్తువులు, వంటలకు భౌగోళిక గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.  ఏదైనా ఒక ప్రాంతంలో ప్రతే్యక గుర్తింపు ఉంటేనే వాటికి భౌగోళిక గుర్తింపు జారీ చేయడం జరుగుతుంది. జీఐ గుర్తింపు పొందిన వస్తువులు, ఆహార పదార్థాలను ఆయా గుర్తింపు పొందిన సంస్థలు, వ్యక్తులు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు వినియోగిస్తే సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే తిరుమల లడ్డూను టీటీడీ తప్ప మరెవరూ తయారు చేసే అవకాశం లేదు.

నాణ్యతపై అసంతృప్తి..

భక్తుల తమ స్నేహితులకోసం, బంధువులరోసం, పని చేసే కార్యాలయాలలో సహచరులకు పంచడానికి, తిరుమల లడ్డూను కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి భక్తుడు సగటున నాలుగైదు లడ్డూలు తీసుకుంటాడు. భక్తుల వేల, లక్షల సంఖ్యలో వచ్చనా సరిపోవడానికి రోజుకు మూడు లక్షలకు పైగా ఒక రోజులో తయారు చేస్తారు. వాటిని భక్తులకు పంపిణీ చేస్తారు. అందువల్ల పోటులో అత్యంత నిష్టతో తయారీదారులు పని చేస్తూంటారు. తిరుమలలో ఒక్క లడ్డూ టర్నోవరే దాదాపుగా ఐదు వందల కోట్ల వరకూ ఉంటుంది. దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ ఇస్తారు. తక్కువ ధరకు ఇస్తారు. అదనంగా కావాలంటే ఒక్కో లడ్డూకు రూ. యాభై చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతి లడ్డూ బరువు ఖచ్చితంగా 175 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డూ నాణ్యతపై వయసు మళ్లిన వారు చెబుతారు. తిరుపతికి క్రమం తప్పకుండా వెళ్లేవారిలో చాలా మంది పెద్దలు లడ్డూ నాణ్యతపై ఎంతో గొప్పగా చెబుతారు. అయితే రానురాను నాణ్యత తగ్గిపోతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తూంటారు. ప్రస్తుతం లడ్డూ తయారీకి ఏకంగా కల్తీ నెయ్యి వాడి చేస్తున్నారని తెలడంతో తిరుమలకు వచ్చ భక్తులతో పాటు యావత్ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు చేదిరాయి.

జంతువుల కొవ్వుతో తయారీపై ఫైర్..

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న వార్తలు తెలుగు రాష్టాల్ల్రో సంచలనంగా మారాయి. తరవాత ఇప్పుడు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది దహించివేస్తోంది.

ఈ లడ్డూ తయారికి బట్టర్ ఆయిల్ ను  విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారనే విషం సంచలనాకి తెలరలేపింది.  తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్‌మాల్‌ జరిగిందని విమర్శలు వచ్చాయి. బటర్ ఆయిల్ స్వచ్చమైన ఆవుల నుండి కాక గేదెలు, ఇతర జంతువుల నుండి తీస్తున్న నెయ్యా కలుస్తుంది. బటర్‌ ఆయిల్‌తో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేశారు. ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. కమీషన్ల కోసం కక్కుర్తిపడి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శలు వెల్లువెత్తాయి.

దోషులను కఠినంగా శిక్షించాలి..

మరోవైపు తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేసే సరఫరాదారుల్లో ఒకరు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్టు టీటీడీ ఈ ఏడాది జూలైలో అధికారికంగా వెల్లడించింది. తిరుమల లడ్డూకు ప్రతీ రోజూ 300`500 లీటర్ల నెయ్యిని వినియోగిస్తుంది టీటీడీ. టీటీడీ మార్కెటింగ్‌ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఈ ప్రోక్యూర్‌మెంట్‌ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ కూడా తిరుమలలోనే ఉంది. అయినా కల్తీ జరిగిందన్న అంశం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కమీషన్ల కోసం తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై నిజంగానే చర్చ జరగాలి. నిజాలు వెలికితీయాలి. ఇది జాతీయ సమస్యగా గుర్తించి దోషులను కఠినంగా శిక్షించాలి. కాదుకాదు.. అవసరమైతే ఉరితీయాలి. దేవుడి వద్ద రాజకీయాలు చేసిన దగుల్బాజీలను ఉరితీయాల్సిందే.

తక్షణ నివేదికకు ఆదేశించిన ఏపీ సీఎం

ఇంతకు ముందు పనిచేసిన ప్రభుత్వాల తప్పిదం వల్లనే లడ్డూ తయారు చేయడంలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి మండి పడ్డారు. దీనిపూ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని తితిదే ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయ సాంప్రదాయాన్ని కాపాడుతామన పేర్కోన్నారు. ఇదిలావుంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు.

Tirumala Srivari Laddu Kalti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *