డిసెంబర్ 8న అయ్యప్ప సామూహిక మహా పడిపూజ
శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో నిత్యాన్నదానం
వాయిస్ ఆఫ్ భారత్, కేయూ డబ్బాలు : హనుమకొండ కేయూ పెగడపల్లి డబ్బాలు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో డిసెంబర్ 8న శ్రీ దాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మూడవ సామూహిక మహా పడిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాటలు పాడేందుకు శ్రీకాంత్ స్వామి ఆర్కెస్ట్రా బృందానికి ఆర్కెస్ట్రా దాత అమ్మోజు సురేష్ తరపు నుంచి మంగళవారం దేవాలయం ప్రారంగణంలో అడ్వాన్స్ అందజేయడం జరిగింది. అలాగే శ్రీ దాసాంజనేయ అయ్యప్ప సేవా సమతి ఆధ్వర్యంలో ప్రతి రోజు దేవాలయ ప్రాంగణంలో 150 నుంచి 200 మంతి స్వాములు అన్నదానం (భిక్ష) పెట్టడం జరుగుతుంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు, దాతల సహకారంతో 30 రోజుల పాటు నిర్వహించేలా ముందుకు వెళుతున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాముల కావాలనుకునే వారు కమిటీ సభ్యులు సంప్రదించి వారి తోచిన రీతిలో సహకారం అందించవచ్చు. అలాగే, శ్రీ దాసాంజనేయ అయ్యప్ప సేవా సమితి పేరు చెప్పుకొని కొందరు వ్యక్తులు ఇంటింటికి తిరిగి విరాళాలు వసూలు చేయడాన్ని కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని సదరు వ్యక్తులను హెచ్చరించింది. మంగళవారం దేవాలయం ప్రారంగణలో అన్నదానం కార్యక్రమం నిర్వహించగా అయ్యప్ప మాల ధారులు పెద్ద ఎత్తున హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
