ఘనంగా స్కిల్ స్టార్క్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ ప్రారంభోత్సవం/ Grand opening of Skill Stark Early Learning Campus
హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : పట్టణంలోని కిషన్‌పుర్‌లో స్కిల్ స్టార్క్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ ను ఘనంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకకు ముందుగా ఎస్వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమలరావు, వైస్ చైర్మన్ డాక్టర్ సువర్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య, స్కిల్ స్టార్క్ ఫౌండర్ అనూప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపస్‌ను స్వయంగా పరిశీలించిన వారు, స్కూల్ డిజైన్ ఎంతో ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మేయర్ రాజేశ్వర్ రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం, డాక్టర్ రమేశ్, డాక్టర్ సుమిత్ర, డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రామారావు, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, జనార్ధన్ తదితరులు హాజరై, స్కూల్ యజమాన్యాన్ని అభినందించారు.


