ఘనంగా శ్రీరామ అక్షింతల శోభయాత్ర
(వాయిస్ ఆఫ్ భారత్, కల్చరల్) అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ పూజిత అక్షింతల శోభయాత్రను శనివారం రెడ్డి కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి కృష్ణ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు నిర్వహించారు. శ్రీరామ భక్తులు, మహిళలు, పెద్దలు, పిల్లలు, మేల తాళాలతో, డప్పు సప్పుళ్ళతో, భజన సంకీర్తనలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో పూజారులు కె.శ్రీనివాస్, హరీష్ కుమార్ లతో పాటు మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, కృష్ణ కాలనీ గుడి చైర్మెన్ తుల శ్రవణ్, కాలనీ అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, గుళ్లపెల్లి సదానందం, నక్క రాజయ్య, మార్క సునీల్, రమణాచారి, విక్రమ్ కుమార్, వేణుగోపాలచారి, రాజేందర్, నరసింహ రెడ్డి, కడారి భూలక్ష్మి, కృష్ణ కాలని, యాదవనగర్, జ్యోతిబాఫూలే నగర్, లోటస్ కాలనిలనుంచి సుమారుగా 150 మంది రామభక్తులు పాల్గొన్నారు.
