ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు/Grand early Bathukamma celebrations

ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు/Grand early Bathukamma celebrations
###@@@Grand early Bathukamma celebrations@@@###

గోపాలపూర్‌ ఎస్ఆర్‌ డీజీ పాఠశాలలో సందడి

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : గోపాలపూర్‌లోని ఎస్ఆర్‌ డిజి పాఠశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోనల్ మేడం రమ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హిమబిందు మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణలో మాత్రమే జరుపుకునే అతిపెద్ద పూల పండుగ అని, ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేడం, ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *