ఘనంగా ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం

సీనియర్ జాతీయ హాకీ క్రీడాకారులు బండ శ్రీనివాస్ కు ఘన సన్మానం
వాయిస్ ఆఫ్ భారత్, జమ్మికుంట : ప్రపంచ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో సీనియర్ క్రీడాకారులు కేక్ కటింగ్ చేసి ఘనంగా ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జాతీయ హాకీ క్రీడాకారుడు, మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నాలుగు దశాబ్దాలుగా జమ్మికుంట, హుజరాబాద్ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం జాతీయ క్రీడాకారులు బండ శ్రీనివాస్, రామ్ రాజా బాబు, అంబాల ప్రభాకర్ (ప్రభు)లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామ్ శ్రీనివాస్, డీకే స్వామి, కుమార్, ఎగిత అశోక్, గండికోట సమ్మయ్య, రామ్ శ్రీనివాస్, తిరుపతి శ్రీనివాస్, కొలుగూరి సురేష్ , నరేష్, శ్యామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
