ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
వాయిస్ ఆఫ్ భారత్, నర్సంపేట : రాజపల్లె గ్రామంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం గ్రామ ప్రజలు, నాయకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం, కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధత అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. మహిళలు, యువత, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సాధబోయిన ప్రసాద్, నామాల నరేష్, కొలువుల కార్తీక్, సముద్రాల శివ, గొర్రె అనిల్, సాధబోయిన రంజిత్, ముత్యం శివ, గడ్డం నాగరాజు, గుర్రాల సంజీవ రెడ్డితో పాటు అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
