ఘనంగా జిఎన్ఆర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం

వాయిస్ ఆఫ్ భారత్, భీమారం :హనుమకొండ జిల్లా భీమారం రామారావు ఆదివారం సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సూపర్ మార్కెట్ యజమాని గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సూపర్ మార్కెట్లో ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు అందుబాటు ధరలలో లభిస్తాయని తెలిపారు. ఇంటికి అవసరమైన నిత్యవసరాలతో పాటు గృహోపకరణాలు కూడా తన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నారు. హనుమకొండ ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
