ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
@@@###Engineers' Day celebrations at SSRP in grand style@@@###

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : భారతరత్న, ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో సోమవారం ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతగట్టు క్యాంపు కార్యాలయంలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అధికారులు విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. తాగునీరు, సాగునీటి రంగాలలో ఆయన చేసిన కృషి, దేశాభివృద్ధికి అందించిన సేవలు అపారమని గుర్తు చేశారు. ఆయన జీవితం, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని ఇంజినీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటారు. ఈయన దేశానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 1955లో భారతరత్న పురస్కారం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *