గ్రీన్‌హౌస్‌లపై ఎస్ఆర్ యూ విద్యార్థుల ప్రదర్శన/ SR University Students
వాయిస్ ఆఫ్ భారత్, ధర్మసాగర్ : ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు, రావెప్ (రూరల్ అవేర్‌నెస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్)లో భాగంగా ధర్మసాగర్ మండలం, నర్సింగరావుపల్లె గ్రామంలో గ్రీన్‌హౌస్ రకాలపై నమూనా ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు స్వయంగా గ్రామంలోని రైతులకు గ్రీన్‌హౌస్‌ల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఈవెన్‌స్పాన్, సా-టూత్, క్వాన్సెట్, రిజ్ అండ్ ఫరో, లీన్-టు వంటి వివిధ రకాల గ్రీన్‌హౌస్‌ల నమూనాలను ప్రదర్శించి, వాటి నిర్మాణ విధానం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే అవకాశాలు, మరియు ఏయే పంటలకు అవి అనుకూలమో వివరించారు. పంటలను వాతావరణ ప్రభావాల నుండి ఎలా రక్షించుకోవచ్చో వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ డాక్టర్ జి. భూపాల్ రాజ్ మార్గదర్శకత్వంలో, రావెప్ కోఆర్డినేటర్ జి. శ్రీకర్ రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ డాక్టర్ రాథోడ్ లాల్, అగ్రి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ టి. సాయి కృష్ణారెడ్డిల సహకారంతో విజయవంతంగా జరిగింది. విద్యార్థినులు ఎస్. వాఙ్మయి, ఎ.సహజ, అశ్రిత, జి.సంధ్య, జి.శివాని ఈ ప్రదర్శనలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను చూసిన గ్రామస్థులు, గ్రీన్‌హౌస్‌ల వినియోగం ద్వారా సీజన్‌తో సంబంధం లేకుండా పంటలు పండించడం, నాణ్యతను మెరుగుపరచడం, ఆదాయం పెంచుకోవడం సాధ్యమని తెలుసుకున్నారు. ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులను తమ పొలాల్లో కూడా అనుసరించాలని ఆసక్తి చూపారు.
