గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల రిమాండ్
వాయిస్ ఆఫ్ భారత్ , మల్హర్ : నిషేధిత గంజాయి అమ్ముతున్న మల్హర్ మండలంలోని కొయ్యూరు, కొండంపేట, ఇప్పలపల్లె గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులను కొయ్యూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాటారం సీఐ నాగార్జున రావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1.54 కిలో గ్రామ్స్ గంజాయి, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నామని ,యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి సేవించిన, అమ్మిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ లు హరి,రఘు, సుధాకర్, సాగర్, నరేష్, మురళి, సురేష్, హోంగార్డు మల్లేష్ పాల్గొన్నారు.
