క్రీడా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని 

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : హనుమకొండ నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి (CREDAI) వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికిపైగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు క్రెడాయి వ్యవస్థాపకులకు అభినందనలు తెలిపారు. నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న క్రెడాయి సంస్థ సామాజిక బాధ్యతను కూడా అలవరుచుకుంటూ రక్తదాన వంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ఎమ్మెల్యే నాయిని ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ఒక గొప్ప పుణ్యకార్యం. ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఆనందకరం. క్రెడాయి సంస్థ నిర్మాణ రంగంతో పాటు సామాజిక సేవలోనూ ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాస్ రావు, క్రెడాయి వరంగల్ అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్, క్రెడాయి చైర్మన్ – తిరుపతి రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ – శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షులు ఎం. రవీందర్ రెడ్డి, ఎల్.రజనీకాంత్ రెడ్డి, జి.రాజేందర్ రెడ్డి; జాయింట్ సెక్రటరీలు – కొండా రెడ్డి, నాగరాజు, వెంకట మల్లా రెడ్డి; కోశాధికారి – వరుణ్ అగర్వాల్; ఈసీ సభ్యులు – రిషిన్ రెడ్డి, మనోహర్, సి. సందీప్, బాబు రావు సభ్యులతో పాటు, నగర ప్రముఖులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *