కౌన్సిలర్ ఏనుగు జ్యోతికి సన్మానం

కౌన్సిలర్ ఏనుగు జ్యోతికి సన్మానం
Honored for Councilor Enugu Jyoti

వాయిస్ ఆఫ్ వందే భారత్, వేములవాడ / హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి (2వ వార్డు) కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతిరెడ్డికి ఘన సన్మానం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి కేటీఆర్ ఆమెను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వార్డు స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి జ్యోతి తిరుపతిరెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యంగా శాత్రాజ్ పల్లి వార్డు అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. సామాన్యుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తన సేవలను గుర్తించి సన్మానించినందుకు కేటీఆర్ కి, తనకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహారావుకి ఏనుగు జ్యోతి తిరుపతిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *