కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతికి భారీ ఏర్పాట్లు/Massive arrangements for Konda Laxman Bapuji’s birthday

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతికి భారీ ఏర్పాట్లు/Massive arrangements for Konda Laxman Bapuji’s birthday
Massive arrangements for Konda Laxman Bapuji's birthday

పరసతి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రేపు (సెప్టెంబర్ 27) పద్మశాలి పరపతి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను జేఏసీ కన్వీనర్ వైద్యం రాజగోపాల్ ఆవిష్కరించారు. ఉదయం 9 గంటలకు బాలసముద్రం ఏకశిలా పార్క్ నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ, అదాలత్ జంక్షన్ మీదుగా ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్‌కు చేరుకుంటుంది. అక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత, కలెక్టరేట్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో పద్మశాలీలు పాల్గొంటారని వైద్యం రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సోదరసోదరీమణులు, కులబంధువులు, నేత కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం కోసం గత రెండు నెలలుగా దాదాపు 30 పరపతి సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం, సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో సుమారు వెయ్యి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అలాగే, ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాంనగర్‌లో జరిగిన సమావేశంలో, గౌడ, ముదిరాజ్, యాదవ, రజక, కుమ్మరి తదితర బీసీ సంఘాలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో గుర్రం కోటేశ్వర్, తుమ్మ సదానందం, దేవులపల్లి సదానందం, గుండేటి చక్రపాణి, బత్తుల రమేష్, బింగి శ్రీనివాస్, కేదాసి వెంకన్న, వడ్డేపల్లి శ్రీనివాస్ తదితరులు కీలకపాత్ర పోషించారు. జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, వేముల నాగరాజు, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ అందించిన సహకారానికి వైద్యం రాజగోపాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *