కర్ణాటక శాసన మండలిలో ఆరతి కృష్ణ ప్రమాణ స్వీకారం/Aarthi Krishna takes oath in Karnataka Legislative Council

కర్ణాటక శాసన మండలిలో ఆరతి కృష్ణ ప్రమాణ స్వీకారం/Aarthi Krishna takes oath in Karnataka Legislative Council
#@@@@Aarthi Krishna takes oath in Karnataka Legislative Council@@@##

హాజరైన యశస్విని రెడ్డి, ఝాన్సి రాజేందర్ రెడ్డి

వాయిస్ ఆఫ్ భారత్, బెంగళూరు ( సెప్టెంబర్ 11) : కర్ణాటక శాసన మండలి కొత్త సభ్యురాలిగా నామినేట్ అయిన ఎన్‌ఆర్‌ఐ ఫోరం వైస్ ప్రెసిడెంట్ ఆరతి కృష్ణ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కర్ణాటక మాజీ మంత్రి దివంగత బేగనే రామయ్య కుటుంబం ఆహ్వానం మేరకు పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సి రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విధాన సౌధలోని బ్యాంకెట్ హాల్‌లో జరిగిన ఈ వేడుకలో ఆరతి కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె నియామకం కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తుందని, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులతో కర్ణాటక రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని మరింతగా బలపరుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై ఆరతి కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆమె మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు దివంగత బేగనే రామయ్య కుటుంబం ఆతిథ్యం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *