కమలాపూర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి చర్యలు/ kamalapur double bed rooms
వాయిస్ ఆఫ్ భారత్, కమలాపూర్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు చొరవతో కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి-రవీందర్ హనుమకొండలో ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. కమలాపూర్ మండలంలోని గూడూరు, మర్రిపల్లిగూడెం, కమలాపూర్‌లలో ఉన్న 450 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన శానిటేషన్, ఎలక్ట్రికల్ పనులను త్వరగా పూర్తి చేసి అర్హులకు అందించాలని వారు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంటనే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణుదాసు వంశీధర్ రావు పాల్గొన్నారు.

