ఏబీవీపీ ధర్నాలో ఉద్రిక్తత/Tension at ABVP dharna
విద్యార్థినిపై సీఐ దురుసు ప్రవర్తన
వాయిస్ ఆఫ్ భారత్, కరీంనగర్: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ (అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ మహిళా విభాగం విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఓ ఏబీవీపీ విద్యార్థినిని మోకాలితో తన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ విద్యార్థిని కిందపడిపోయింది. వెంటనే తేరుకున్న విద్యార్థిని, సీఐతో వాగ్వాదానికి దిగి, “నన్ను ఎందుకు తన్నావు? ఎందుకు జుట్టు పట్టుకుని లాగుతున్నావు?” అని ప్రశ్నించింది. గతంలో కూడా సీఐ తన వివాదాస్పద ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె వేధింపుల కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయినా సరే, ఆమె తీరు మారలేదని, ఇలా అత్యుత్సాహంతో విద్యార్థులపై వ్యవహరించడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీఐ ప్రవర్తనపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
