ఉపాధి హామీ పని ప్రదేశాలలో  సౌకర్యాలు కల్పించాలి

ఉపాధి హామీ పని ప్రదేశాలలో  సౌకర్యాలు కల్పించాలి

ఉపాధి హామీ పని ప్రదేశాలలో  సౌకర్యాలు కల్పించాలి

 వాయిస్ అప్ భారత్ (డోర్నకల్ న్యూస్):

ఉపాధి పని జరుగుతున్న ప్రదేశాలలో కనీస వసతులు అయిన టెంటు మంచినీరు మెడికల్ కిట్లు వగైరా లేవని ఎండాకాలంలో మమ్మురంగా జరుగుతున్న ఉపాధి హామీ పనులలో కనీస వసతులు లేకపోవడంతో ఉపాధి కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జి సక్రులు వాపోయారు .డోర్నకల్ మండలం బంజర గ్రామంలో అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు యాస వెంకట్ నారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో వారు ప్రసంగిస్తూ ఉపాధి కూలికి 200 రోజులు పని కల్పించాలి కనీస వేతనం రోజుకు  600 రూపాయలు చెల్లించాలని వారం వారం వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలి కేంద్రాలలో రైతులకు టెంటు సౌకర్యాలు భోజన సౌకర్యం పాల్తిన్ పట్టాలు గోనె సంచులు కావలసినంత రైతులకు సరఫరా చేయాలి. వరి ధాన్యానికి కింటా వక్కింటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 500 రూపాయలు బోనస్ కలిపి చెల్లించాల నీ వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలోసంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పుణ్యం బిక్షం అన్న ఆలకుంట సాయిలు .ఉడుగుల లింగన్న చింత .వెంకన్న తోకల వెంకన్న బట్టు వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *