ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా
- మంత్రి కొండా సురేఖ
(వాయిస్ ఆఫ్ భారత్, పొలిటికల్ న్యూస్) : ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు, మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పిల్లి సాంబశివరావు, బత్తిని సుదర్శన్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్ టీజీపీఏ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ టీయూసీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో శనివారం మంత్రిని కలిసి శాలువా, బోకే లతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సీపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను అమలుచేయాలని, జీఓ నెం 317 ని వెంటనే రద్దుచేసి వారి సొంత జిల్లాలలో తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని, ఈ కుబేర్ ను వెంటనే రద్దు చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని, మెడికల్ డిపార్ట్ మెంట్ లో జీఓ 142ని రద్దు చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్ లు చేపట్టాలని, అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నగదు రహిత వైద్య సేవలు అందించాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన ఫార్మసిస్ట్స్ లను ఖాళీ పోస్ట్స్ ల్లో తిరిగి తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పు ప్రసాద్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మంచిక ప్రమోద్ కుమార్ గౌడ్, ఇంజినీర్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గులాం యజ్ దాని, సీహెచ్ ఓల సంఘం రాష్ట్ర నాయకులు ఓన పాకల రాజయ్య, కంద కట్ల శరత్ బాబు, టీజీపీఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ వరంగల్ జిల్లా సెక్రటరీ గుగులోత్ వీరేందర్ నాయక్, పి.ప్రసాద్, ఆప్తాల్మిక్ ఆఫీసర్స్, కె.వేణుగోపాల్, వి.సమ్మయ్య, బూర నారాయణ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాయకులు గోగు మల్లయ్య, భూక్య శివాజీ, సతీష్, ఈఎస్ ఐ హాస్పిటల్ రాష్ట్ర నాయకులు వి.శ్రీనివాస్, మధు, ఎన్ హెచ్ ఎం స్టేట్ నాయకులు సుదర్శన్, హెల్త్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ స్టేట్ నాయకులు తిరుపతయ్య, ఐఎన్ టీయూసీ నాయకురాలు భాగ్యలక్ష్మి, ప్రేమలత, నర్సమ్మ, శైలజ, రాజ్యలక్ష్మి, ప్రసూన శ్రీ, ముత్తి లింగం, ప్రార్మసిస్ట్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ డి.ప్రకాష్ రావు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు సంబు నాయక్, లావుడ్య పుల్య, ఇతర అన్ని విభాగాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
