ఇంటర్ ఫలితాల్లో షైన్ ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో షైన్ ప్రభంజనం
###Shine Prabhanjan in Inter results@@@

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ, బైపీసీలో స్టేట్ ర్యాంకులు సాధించి కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలను సాధించడం జరిగిందని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగుల రమ, పి.రాజేంద్రకుమార్, షైన్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ డైరెక్టర్ జె. శ్రీనివాస్, ఐఐటి కో-ఆర్డినేటర్ మూగుల రమేష్ యాదవ్లు సంయుక్తంగా తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలలో షైన్ జూనియర్ కాలేజి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి ఇంటర్మీడియట్ విద్యలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్ లో అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో ఎం.దీక్షిత -468, కె.యశస్విని కుమారి -467, కె. నిశాంత్- 467, 11మంది విద్యార్థులకు 466, 23మంది విద్యార్థులకు 465 మార్కులు, బైపీసీ మొదటి సంవత్సరంలో అకిబ్ అలీ-437, సీహెచ్ కీర్తన -436, సీహెచ్ అజిత్ రెడ్డి-435, ఎండీ సాదుద్దీన్ – 435,ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీలో డీ. అనువర్షిణి -992, జి.వికాస్ -991, భార్గవి వీరారెడ్డి -991, ఎం.వరుణ్ సందేశ్ -991, ఎం.రక్షిత -990, బైపీసీలో డి.ఇందు-991, కె సహస్ర 991, వెంకటశివాణి -989, ఎం.రమ్య -989, టీ హాసిని -987 సాధించిన విద్యార్థులను అభినందించారు. వీరితో పాటుగా రెండవ సంవత్సరంలో ఎంపీసీలో 970 మార్కులకు పైగా 66 మంది విద్యార్థులు, బైపీసీలో 960కి పైగా 31 మంది విద్యార్థులు అలాగే మొదటి సంవత్సరం ఎంపీసీలో 460కి పైగా మార్కులు 67 మందికి బైపీసీలో 10 మంది విద్యార్థులు 430కి పైగా మార్కులు సాధించారు. ఈ సందర్బంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్ ఐఐటీ కో-ఆర్డినేటర్ రమేష్ యాదవ్, కళాశాల ప్రిన్సిపల్స్ మారబోయిన రాజు గౌడ్, కె. శ్రీనివాసన్, సంధ్య, ప్రశాంత్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *