ఇంటర్ ఫలితాల్లో ఆల్పోర్స్ కళాశాల జయభేరి

ఇంటర్ ఫలితాల్లో ఆల్పోర్స్ కళాశాల జయభేరి
@@@Allphors College wins in Inter results###

త్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

అభినందించిన సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : గోపాలపురంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఓరుగల్లు వంటి చారిత్రాత్మక నగరంలోని విద్యార్థులు ఇకపై హైదరాబాదు, విజయవాడ, గుంటూరులోని కార్పొరేట్ కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి స్వస్థలంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగిన ఫిజికల్ క్లాసులు అందించాలనే లక్ష్యంతో హనుమకొండ, వరంగల్‌లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను స్థాపించామని తెలిపారు. ఇందులో భాగంగా, ఆల్ఫోర్స్ విద్యార్థులు IIT, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి తమ ప్రతిభను చాటుతున్నారు. ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు చారిత్రాత్మక విజయాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జె.అంజనా (బైపీసీ విభాగం)లో 997 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంపీసీ విభాగంలో కె. రుత్విక్ 996 మార్కులు, ఎస్. సేవితా, టి. కీర్తన, ఎస్. కీర్తన 994, జి. వర్షిణి 993, టి. సాత్విక, హెచ్. పల్లవి, డి.గాయత్రి, కె. హసిని 992 మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో గరిష్టంగా 470 మార్కులకు గాను జి.తరుణ్ మరియు ఎ.నిచిత 468, కె. సహస్ర, వి. శ్రీ వర్షిణి, పి.సిరిచందన, ఎస్.దేషిమి, కె. వర్షి, పి. సాత్విక, కె. శ్రీశాంత్, పి.బన్ని, కె.గీతాం నిహారి, వి. హాసిని 467 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో సభిలా తారీమ్, సామాఫి రథోస్–438,యు. హాసిని–437, సీహెచ్. మనస్వీని–436 మార్కులు సాధించారు. అలాగే, ఇటీవల విడుదలైన ఐఐటీ, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా ఆల్ఫోర్స్ విద్యార్థులు విశేషంగా రాణించారని, రాబోయే నీట్, ఎంసెట్ ఫలితాల్లోనూ ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తారని డాక్టర్ నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *