ఆడపిల్లకు స్వాగతం
- మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయల కార్యక్రమం
- దంపతులకు సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్ అందచేత
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్) : ఆడపిల్లంటేనే వివక్ష చూపుతున్న ఈ రోజుల్లో తమకు బాలికే కావాలంటూ ఎదురు చూసిన దంపతుల కల నెరవేరడంతో వారి కళ్లలో ఆనందం వెళ్లి విరిసింది. తన బిడ్డ గురించి అందరికీ తెలిసేలా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయాలనే వారి ఆశను హనుమకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సహకారంతో 21 రోజుల కార్యక్రమాన్ని శనివారం కాజీపేట మండలం మడికొండ ఎన్జీవోస్ కాలనీ ఆరో అంగన్వాడి కేంద్ర పరిధిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ మాట్లాడుతూ ఆడ పిల్ల కావాలని ఎదురు చూసిన దంపతులకు నిజమైన బహుమానం లభించిందన్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శాడ జాన్సన్ దంపతులను సాంప్రదాయ పద్దతిలో సన్మానించి సదరు చిన్నారిని ఊయలలో వేశారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసి సంబంధిత పాస్ బుక్ ను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ డి.రాజ్యలక్ష్మి , స్థానిక అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి హైమావతి, సూపర్వైజర్ వంచ రాజ్యలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్.ప్రవీణ్ కుమార్, సఖి అడ్మిన్ హైమావతి, జిల్లా మహిళా సాధికారత కేంద్ర స్వర్ణ, సోషల్ వర్కర్ మెరుగు శ్రీనివాసులు, జి.సునీత, కౌన్సిలర్ అనుముల మాధవి, చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, అంగన్వాడి టీచర్లు వెంకట లక్ష్మీ,శారద, రజిత, రాజమణి, మల్లేశ్వరి, పూల, లలిత, స్వర్ణ, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

