అయోధ్య ప్రతిష్టకు హాజరైన ఇమాం
వాయిస్ ఆఫ్ భారత్ (నేషనల్ న్యూస్): అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఏ రాముడి గుడి కోసం అయితే పోరాటం జరిగిందో.. అదే గడ్డంపై ఇప్పుడు మతాలన్నీ వెనక్కి వెళ్లి.. మానవత్వం ఫరిడవిల్లింది. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను స్వాగతిస్తున్నారు ముస్లిం మత పెద్దలు. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని, పులకించిపోయారు. అందుకే దీనిని నవ భారతదేశ ముఖం అని పేర్కొనడం జరుగుతోంది. సోమవారం అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సాదువుతో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. ’ఇది నవ భారతదేశం ముఖచిత్రం. మన అతిపెద్ద మతం మానవత్వం. మనకు దేశమే ఫస్ట్’ అని ఇల్యాసీ పేర్కొన్నారు. కాగా, ఈ వీడియోను చూసి సోషల్ విూడియాలో నెటిజన్లు ’నేడు గర్వంగా ఉంది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సీన్‌ను చూస్తుంటే నిజంగా రామరాజ్యం ఇలాగే ఉండేదేమో అని పేర్కొంటున్నారు. నటుడు జాకీష్రాఫ్ తదితరులు కూడా హాజరయ్యారు.
