అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రాంపెల్లి లింగమూర్తి

అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రాంపెల్లి లింగమూర్తి
@@social media incharge @@

వాయిస్ ఆఫ్ భారత్, వరంగల్ : అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కుల అభివృద్ధి, సోషల్ మీడియాలో కులబాంధవుల క్రియాశీలక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో, జిల్లా కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు నూతనంగా సోషల్ మీడియా ఇంచార్జిని నియమించింది. ఈ మేరకు అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ పర్యవేక్షణలో రాంపెల్లి లింగమూర్తిని వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై కులబంధువులు, కుల నేతలు రాంపెల్లి లింగమూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *