అంగన్‌వాడీ నియామకాల్లో అవకతవకలు/Irregularities in Anganwadi appointments
మహిళా శిశు సంక్షేమ అధికారిణిపై తీవ్ర ఆరోపణలు
కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారిణి ఆర్జెడీ కార్యాలయంలో సూపరింటెండ్ గా ఉన్న సమయంలో పలు అభియోగాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉద్యోగులందరి నుంచి ఆమెకి సంబంధించిన అరాచకాలపై కరపత్రాలు సమర్పించబడిన నేపథ్యంలో ఆ అధికారిణి ఆర్జెడీ కార్యాలయం నుంచి ఇతర ప్రాజెక్టులకు బదిలీ చేశారు. వర్ధన్నపేట ప్రాజెక్ట్‌లో సీడీపీఓగా ఉన్న సమయంలో ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా నల్లబెల్లి అంగన్వాడీ టీచర్ నియామకంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించబడింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లేకుండా కూడా డబ్బులు తీసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలిజిబుల్ అభ్యర్థుల అభ్యర్థనలు దెబ్బతిన్నాయి. ఆ టీచర్ నుంచి నియామక సంబంధ పత్రాలను తీసుకుని ఆమెను ఉద్యోగానికి రానివ్వకూడదని బెదిరింపు కూడా ఆ అధికారిణి నుంచి రావడంపై ఫిర్యాదులు అందాయి. దీనివల్ల నియామకాలు నిలిచిపోవడం, వాస్తవ అర్హులకూ ఉద్యోగం రాలేదు. ఫలితంగా, ఆ ప్రాంతంలోని చిన్నారులు, మహిళల పోషకాహారం సరైన పర్యవేక్షణ లేకుండా కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారిణిపై పూర్తి ఎంక్వైరీ చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను పలువురు ప్రజాసంఘాల నాయకలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
