శ్వేతార్క గణపతిని దర్శించుకున్న ఉప లోకాయుక్త
వాయిస్ ఆఫ్ భారత్, కాజీపేట : హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రముఖ దేవాలయమైన స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంకు బుధవారం తెలంగాణ రాష్ట్ర గౌరవ ఉప లోకాయుక్త, మాజీ హనుమకొండ జిల్లా జడ్జి శ్రీ బీఎస్ జగ్ జీవన్ కుమార్ తన సతీమణితో కలిసి దివ్య దర్శనార్థం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అయినవోలు సాయి కృష్ణ శర్మ, పూర్ణకలశ మహామంత్రోచ్ఛారణలతో అతిధులను ఆత్మీయంగా స్వాగతించారు. ముందుగా ఆలయంలో కొలువైన శ్రీ అది మూల గణపతి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని 29 దేవతా విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదిక కార్యక్రమాల నిర్వహణలో అయినవోలు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామి సన్నిధిలో అష్టోత్తర షోడశ ఉపచార పూజ, సంకల్ప సహిత శ్వేతార్క అర్చన నిర్వహించబడింది. అనంతరం స్వామివారి హారతి, తీర్థప్రసాదం, శేష వస్త్రం, చిత్రమాలిక చిత్రపటం, వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల రెవెన్యూ అధికారి బావ్ సింగ్, హనుమకొండ రెవెన్యూ శాఖ అధికారి రమేష్ రాథోడ్, కాజీపేట మండల ఆర్ఐ శివ, ఎస్సై లవన్ కుమార్, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది మేనేజర్ లక్క రవి, పీఆర్వో మణిదీప్, శ్రీనివాస్ రావు, పాక పవన్, పాక సాత్విక్, పాక యశ్వంత్, వరికోల్ సాయికుమార్, ఆలయ అర్చకులు హరికృష్ణ స్వామి, ఆనంద్ కుమార్ త్రిపాఠి, మనోజ్ త్రిపాఠి, రోహిత్ ఉపాధ్యాయ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

