శ్రీ వారాహి రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ /Grand opening of Sri Varahi Restaurant
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : నగరంలోని కుమార్ పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారాహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీ వారాహి హోటల్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రెస్టారెంట్‌లో ఏసీ మల్టీ క్యూసిన్, ఫ్యామిలీ రెస్టారెంట్, బ్యాంక్వెట్ హాల్స్, బోర్డు రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కేటరింగ్ సేవలను కూడా అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హోటల్ చైర్మన్ సుమన్, బీజేపీ నాయకుడు బైరి శ్రవణ్, ఎర్రోజు సారిక తదితరులు పాల్గొన్నారు.

