శరన్నవరాత్రి అమ్మవారి రూపాలు | Navadhurga

శరన్నవరాత్రి అమ్మవారి రూపాలు | Navadhurga
VoiceofBharath (Cultural News): శరన్నవరాత్రి 2025: అమ్మవారి తొమ్మిది రూపాలు, విశేషాలు శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవికి అంకితం చేయబడిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడం అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.
ఆరాధనా విధానం :  శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకరించి ఆరాధిస్తారు. కొంతమంది తమ ఆచారాలకు అనుగుణంగా నవదుర్గ రూపాలతో, మరికొందరు వాహన సేవలతో అమ్మవారిని అలంకరిస్తారు.
ముఖ్యమైన రూపాలు, అలంకరణలు
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని అలంకరించే రూపాలు, వాటికి సంబంధించిన ఇతర నామాలు ఈ విధంగా ఉన్నాయి:
  • మొదటి రోజు: శైలపుత్రి అలంకరణ (బాలా త్రిపుర సుందరి).
  • రెండవ రోజు: బ్రహ్మచారిణి (అన్నపూర్ణాదేవి).
  • మూడవ రోజు: చంద్రఘంటా అలంకరణ (గాయత్రి దేవి).
  • నాల్గవ రోజు: కుష్మాండి అలంకరణ (మహాలక్ష్మి అమ్మవారు).
  • ఐదవ రోజు: స్కందమాత అలంకరణ (శ్రీ రాజరాజేశ్వరి లలిత మాత త్రిపుర సుందరి).
  • ఆరవ రోజు: కాత్యాయని అలంకరణ (భవాని దేవి).
  • ఏడవ రోజు: కాలరాత్రి అలంకరణ (సరస్వతి దేవి).
  • ఎనిమిదవ రోజు: మహాగౌరీ అలంకరణ (దుర్గాష్టమి).
  • తొమ్మిదవ రోజు: సిద్ధిధాత్రి అలంకరణ (మహిషామర్దిని).
విజయదశమి ప్రాముఖ్యత : నవదుర్గ రూపాలు పూర్తిచేసుకున్న తర్వాత, పదవ రోజున అమ్మవారిని అపరాధిత దేవిగా అలంకరించి ఆరాధిస్తారు. ఈ రోజునే అమ్మవారు మహిషాసురమర్దినిని సంహరించి విజయాన్ని ఎగురవేస్తుంది, అందుకే దీనిని విజయదశమి అని అంటారు. రాక్షసులను అంతమొందించి లోకాన్ని అనుగ్రహించిన ఆ తల్లి అనుగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు ఈ ఉత్సవాలను జరుపుకుంటారు.
ఆరాధన ఫలితాలు :  ఆదిశక్తిగా పూజించబడే అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలలో ఆరాధించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ బాధలు తొలగిపోవడంతో పాటు, ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోయి, సుఖ సంతోషాలతో ఉంటారని, కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు.
——————————————————————————————————————————————————————————————
If you are like this content  Please Subscibe our Website. For more updates follow our website : https://voiceofbharath.in
——————————————————————————————————————————————————————————————

 

#DurgaPuja, #Navaratri2025, #SharadNavaratri,  #DeviDurga, #GoddessDurga, #NineFormsOfDurga,

#Navadurga, #Vijayadashami, #HinduFestival, #Spirituality, #FestivalOfIndia, #Dasara2025,

#GoddessWorship, #DivineFeminine, #Hinduism

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *